
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై బాధితులకు వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించారు. ఏ స్థాయిలో ఆ సమస్య ఉందో ఆ అధికారికి వాటిని పంపి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.