
ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
నల్లగొండ టౌన్ : నులి పురుగుల నివారణ కోసం 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్, రేణుక, డీఈఓ భిక్షపతి, జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.