
నేడు చిట్యాలకు మంద కృష్ణమాదిగ రాక
చిట్యాల : చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చిట్యాలలో సోమవారం నిర్వహించనున్న నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి చేయూత పింఛన్‌దారులు, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
ప్రజాసేవ చేయడమే
లయన్స్ క్లబ్ లక్ష్యం
నల్లగొండ టౌన్: పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ముందుకెళ్తోందని లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం నల్లగొండలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 2025–26 జిల్లా కేబినెట్ ఇన్‌స్టాలేషన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జ్వోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సేవే పరమావధిగా స్థాపించబడిన లయన్స్ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా పేదప్రజలకు చేయూతగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా సమయంలో కూడా పేదప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్‌కుమార్ రూమాల్ల, గోపాల్‌రావు, దీపక్ బట్టాచార్య, టి.రాజేంద్రప్రసాద్, రాజిరెడ్డి, భీమయ్య, కేవీ.ప్రసాద్, సతీష్ కుమార్, రామకృష్ణ, అశోక్‌రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆత్మగౌరవ పోరుకు
యాదవులు సిద్ధంకావాలి
నల్లగొండ టౌన్: యాదవులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్‌లో ఏర్పాటు చేసిన ఆ మహాసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సోమవారం చేపట్టిన రెజాంగ్లా రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలన్నారు. యాత్రలో భాగంగా దేవరకొండ, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, కనగల్ ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అలాగే 12వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండలోని క్లాక్‌టవర్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. యాదవుల ఆత్మ గౌరవం పెంచడానికి అహిర్ రెజిమెంట్ ప్రకటించాలని ఇండియన్ ఆర్మీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుందన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, సోమనబోయిన సుధాకర్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, కొలగాని పర్వతాలు యాదవ్, ఎల్‌వీ.యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, గంగుల చందువంశీ యాదవ్, గుండెబోయిన జానయ్య యాదవ్, ముప్పిడి మల్లయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, జాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు.
యాదగిరీశుడికి
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు.

నేడు చిట్యాలకు మంద కృష్ణమాదిగ రాక