
మూసీకి స్వల్పంగా తగ్గిన ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి 4,365 క్యూసెక్కుల వదరనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండడంతో అధికారులు శనివారం ఐదు గేట్లు తెరవగా రెండింటిని ఆదివారం మూసి వేశారు. మిగతా మూడు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 3,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 643.50 అడుగుల వద్ద ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఫ మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల