
బోనాల పండుగ.. ఉపాధి మెండుగ
ఫ సోదరా నీవే రక్ష
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సాక్షి నిర్వహించిన ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఆహ్వానానికి విశేష స్పందన
లభించింది. మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు రాఖీ
కట్టి సెల్ఫీ తీసుకుని పంపించారు.
అందులో కొన్ని..
రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్: ఉమ్మడి జిల్లాలో శ్రావణ మాసం బోనాల సందడి నెలకొంది. హైదరాబాద్‌లో ఆషాడమాసంలో బోనాలు నిర్వహిస్తే, పల్లెల్లో మాత్రం శ్రావణమాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఇంటికొచ్చే బంధువులు, ఆడపడుచుల రాకతో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల పండుగ సామాజికంగా, ఆర్థికంగా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది.
ఫ గ్రామాల్లో శ్రావణమాసం
బోనాల సందడి
ఫ కుండలు, నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు, బ్యాండ్, డప్పులు, ఎల్‌ఈడీ లైటింగ్‌కు ఫుల్ గిరాకీ
బోనాల పండుగలో భాగంగా అమ్మవార్లకు ప్రతి కుటుంబం నుంచి బోనం సమర్పిస్తారు. కుమ్మరి వృత్తివారు వివిధ ఆకారాల్లో బోనం కుండలతో పాటు దానిపై దీపం పెట్టే మూతను ఒక సెట్‌లాగా తయారుచేసి అమ్ముతున్నారు. బోనాల సీజన్‌లో కుండలకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో నెల రోజుల ముందు నుంచే కుండల తయారీ ప్రక్రియ ప్రారంభించారు. ఆర్డర్లకు అనుగుణంగా కుండలు, చిన్న గురిగిలను తయారు చేసి ఇస్తున్నారు.
నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు అ‘ధర’హో..
సాధారణ రోజుల కంటే శ్రావణమాసం బోనాల సమయంలో నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి నాటుకోళ్లు, గొరెర పొట్టేళ్లను బలిస్తారు. సాధారణంగా నాటుకోడి కిలో రూ.500 ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కుగా ఉండడంతో రూ.600 నుంచి 700 వరకు ధర పలుకుతోంది.
కుల వృత్తులకు
కలిసొచ్చే పండుగ..
బోనాల ఊరేగింపులో బ్యాండ్, డప్పు చప్పుళ్లు, డీజేలు ఉపయోగిస్తుతండడంతో వారికి ఉపాధి లభిస్తోంది. మాంసం విక్రయించే వారు, చాకలి, మంగలి కుల వృత్తుల వారు, ఎల్‌ఈడీ లైటింగ్, నైవేద్యం తయారీకి కిరాణా సామాను కొనుగోలు చేస్తుండడంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది.
వ్యాపారులు, ప్రభుత్వానికి లబ్ధి
బోనంతో పాటు అమ్మవారిని అంకరణకు పూలు, మామిడి ఆకులు అవసర ఉండడంతో పూల మార్కెట్లలో వ్యాపారం ఊపందుకుంది. కొబ్బరికాయలు విక్రయించే వారికి కూడా గిరాకీ పెరిగింది. బస్సుల్లో ప్రయాణించే వారితో ఆర్టీసీకి, బోనాల సందర్భంగా మద్యానికి డిమాండ్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
గిరాకీ బాగుంది
శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా కుండల గిరాకీ బాగానే ఉంది. సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు దగ్గర కుండలు పెట్టి విక్రయిస్తున్నాను. వివిధ సైజులను బట్టి రూ.150 నుంచి 300 దాకా అమ్ముతున్నాం.
– నిమ్మనకొట్టి పూలమ్మ,
కుండల వ్యాపారి, సూర్యాపేట
రకరకాల డిజైన్లతో తయారు చేస్తున్నాం
వివిధ రకాలుగా బోనం కుండలను డిజైన్ చేసి అమ్ముతున్నాం. బోనం కుండ మూత దానిమీద పెట్టే గురిగి, వెయ్యి గండ్ల బోనం, సాదా బోనం కుండ, అలంకరణ చేసిన బోనం కుండలను విక్రయిస్తున్నాం. వైరెటీని బట్టి ధర ఉంటుంది.
– మురళి, కుమ్మరి బజార్, సూర్యాపేట
ముందుగానే ఆర్డర్లు ఇస్తారు
బోనాల పండుగ కోసం మట్టి కుండలు, చిన్న గురుగులు, దీపం మూతలను ముందుగానే ఆర్డర్లు ఇస్తారు. దానికి అనుగుణంగా తయారుచేసి పంపుతాం. ఇంటి వద్ద కూడా విక్రయిస్తాం. నెల రోజుల పాటు ఆర్ధికంగా చేదోడుగా ఉంటుంది.
– బొడ్డుపల్లి మల్లయ్య, కుండల తయారీదారుడు, నల్లగొండ
మట్టి కుండలకు గిరాకీ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ

బోనాల పండుగ.. ఉపాధి మెండుగ