మూడు నెలలుగా మందుల కొరత | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలుగా మందుల కొరత

Aug 11 2025 6:18 AM | Updated on Aug 11 2025 6:18 AM

మూడు నెలలుగా మందుల కొరత

మూడు నెలలుగా మందుల కొరత

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని వెల్‌నెస్‌ సెంటర్‌కు మందుల కొరత పట్టిపీడిస్తుంది. మూడు నెలలుగా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండడం లేదు. కేవలం మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్‌లు, కొన్ని క్రీమ్‌లు, చిన్నా చితక మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నెలనెలా మందుల కోసం వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడికే..

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, జర్నలిస్టులు.. వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. హెల్త్‌ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా బీపీ, షుగర్‌, గుండె, కిడ్నీ , కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి నెలా వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చి ఉచితంగా మందులను తీసుకెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వారు ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపించుకుని మందులు తీసుకుంటారు. కానీ మూడు నెలలుగా సక్రమంగా మందులు లేకపోవడంతో ఉన్న మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్లు, సిరప్‌లు, క్రీమ్‌లు ఇచ్చి పంపుతున్నారు. మిగతా మందులు వచ్చాగా వచ్చి తీసుకుపోవాలని ఫార్మసిస్టులు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో మందులు లేని కారణంగా దూరం ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందులు అందుబాటులో ఉంచేలా చూడాలని కోరుతున్నారు.

ఫ వెల్‌నెస్‌ సెంటర్‌లో మూడు నాలుగు రకాలు మాత్రలే అందుబాటులో..

ఫ దీర్ఘకాలిక వ్యాధుల ట్యాబ్లెట్లు లేవంటున్న సిబ్బంది

ఫ ఇబ్బంది పడుతున్న హెల్త్‌ కార్డుదారులు

ఇండెంట్‌ పంపించాం

వెల్‌నెస్‌ సెంటర్‌లో అవసరమైన మందుల కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇండెంట్‌ పంపించాం. దశల వారీగా పంపుతున్నారు. పేషంట్‌ల సంఖ్యకూడా గణనీయంగా పెరిగింది. మందులు తక్కువగా పంపిస్తున్నారు. రోగులకు ఇంబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ లావణ్య, వెల్‌నెస్‌సెంటర్‌ ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement