
పూర్తిస్థాయి నీటిమట్టానికి సాగర్
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాలువల ద్వారా మరో 15,577 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడం.. ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఫ మరోసారి తెరుచుకోనున్న క్రస్ట్‌గేట్లు