
ఇసుక దందాను అరికట్టేందుకే..
ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు.
- 8లో
వ్యర్థాలు తొలగింపు
నల్లగొండ టౌన్ : జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎట్టకేలకు తొలగించారు. ఆస్పత్రిఆవరణలోని వ్యర్థాలతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారిందని ‘సాక్షి’లో గురువారం ఆరుబయటే ఆస్పత్రి వ్యర్థాలు అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. వెంటనే ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాల కుప్పలను ఆగమేఘాల మీద తొలగించి పరిశుభ్రం చేయించాయి.