
ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ చేయాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంతో పాటు, లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికస్థోమత లేకపోతే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం ఇప్పించాలన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాను ఆధునీకరించాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, గనుల శాఖ ఏడీ శామ్యూల్ జాకబ్ పాల్గొన్నారు.