
సాగర్‌లో తెలంగాణ లోకాయుక్త
నాగార్జునసాగర్ : తెలంగాణ లోకాయుక్త ఏ.రాజశేఖర్‌రెడ్డి సోమవారం నాగార్జునసాగర్‌కు వచ్చారు. స్థానిక విజయవిహార్‌లో పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్‌ఐ దండ శ్రీనివాసరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. వారి వెంట సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ ముత్తయ్య ఉన్నారు.
23.1 మిల్లీమీటర్ల వర్షం
నల్లగొండ టౌన్ : అల్పపీడన ద్రోణి కారణంగా 30 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 23.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకిరేకల్ మండలంలో 76.1 మిల్లీమీటర్లు, కట్టంగూర్‌లో 60.8, అత్యల్పంగా దేవరకొండ మండలంలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చిట్యాల మండలంలో 31.8, నార్కట్‌పల్లి 23.7, శాలిగౌరారం 36.5, కేతేపల్లి 48.0, తిప్పర్తి 45.3, నల్లగొండ 39.7, కనగల్ 9.6, మునుగోడు 31.0, చండూరు 7.8, మర్రిగూడ 11.6, నాంపల్లి 7.8, గుర్రంపోడు 31.7, అనుముల హాలియా 39.6, నిడమనూరు 21.0, త్రిపురారం 17.6, మాడ్గులపల్లి 12.6, వేములపల్లి 9.1, మిర్యాలగూడ 5.2, దామరచర్ల 26.8, అడవిదేవులపల్లి 46.3, తిరుమలగిరి సాగర్ మండలంలో 46.8, పెద్దవూర 37.0, పెద్దఅడిశర్లపల్లిలో 5.5, గట్టుప్పల్ మండలంలో 23.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.