ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే శిక్షణ పొందాం
2009లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎంపీలు అందరం అప్పట్లో శిక్షణను పూర్తి చేశాం. ప్రస్తుతం మేమంతా ప్రాథమిక చికిత్సనే అందిస్తున్నాం తప్ప ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయడం లేదు. మాపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– పొనుగోటి హనుమంతరావు, సుశృత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


