బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
మిర్యాలగూడ టౌన్ : డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు త్వరలోనే బయోమైనింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాంనగర్ బంధం వద్ద ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డును పరిశుభ్రంగా ఉంచి పర్యటక కేంద్రంగా ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా జడ్చర్ల–కోదాడ ప్రధాన రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు వెంటనే రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 9 మంది ఎన్‌ఎంఆర్‌లు ఉంటే వారిలో నలుగురు మృతి చెందారని, ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31వ వరకు పొడిగించిందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసుఫ్, ఆర్‌ఓ జ్ఞానేశ్వరీ, టీపీఎస్ అంజయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ, శంకర్, ఏఈ అనిల్, వినోద్, చరణ్ తేజ్, శ్వేతారెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్


