
ఉద్యోగాలు ఇప్పించకపోతే చావే శరణ్యం..
దామరచర్ల మండలంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు 2015లో 186 మంది రైతులు 920 ఎకరాల భూమి ఇచ్చారు. భూసేకరణ సమయంలో కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓలతో పాటు నాయకులు కూడా వచ్చి భూములు ఇచ్చే రైతులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రైతులు సంతోషంగా భూములు ఇచ్చారు. భూమి తీసుకుని పదేళ్లు అవుతున్నా ఉద్యోగాలపై ఎవరూ సమాధానం చెప్పడం లేదంటూ వీర్లపాలెం గ్రామానికి చెందిన 50 మంది రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగం ఇప్పించకపోతే మాకు చావే శరణ్యమని వాపోయారు. – థర్మల్ పవర్ ప్లాంట్‌కు
భూములు ఇచ్చిన రైతులు
మూడు చక్రాల ఎలక్ట్రికల్ వాహనం ఇప్పించాలి
నల్లగొండలోని గొల్లగూడెం ప్రాంతానికి చెందిన జక్కల లింగయ్య చిన్న తనంలోనే పోలియో వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన అన్న దగ్గరనే ఉంటూ పింఛన్‌తో జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడికై నా వెళ్లడానికి మూడు చక్రాల చార్జింగ్ బండి ఇప్పించాలని కలెక్టర్‌ను కోరాడు.
– జక్కల లింగయ్య, నల్లగొండ

ఉద్యోగాలు ఇప్పించకపోతే చావే శరణ్యం..