
నకిరేకల్ : ‘కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.. ఆ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా.. శ్రీరామ నవమి సందర్భంగా చెబుతున్నా.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష’ అని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బుధవారం రాత్రి నకిరేకల్‌లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణవెల్లంల – ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతం రైతాంగానికి నీళ్లు ఇస్తామన్నారు. కులం, మతం పేరు చెప్పి వచ్చేటోళ్లను ప్రజలు నమ్మవద్దన్నారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీ తగ్గకుండా చూస్తానని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డనైన తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాయకులు పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, కొండేటి మల్లయ్య, దైద రవీందర్, చనగాని దయాకర్, ఎంపీపీలు శ్రీదేవి, శేఖర్, ముత్తిలింగం, గంగధర్‌రావు, వెంకట్‌రెడ్డి, కొండయ్య, రాఘవరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కులం, మతం పేరుతో
వచ్చేవాళ్లను నమ్మొద్దు
ఫ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి