అభ్యర్థులకు తడిసిమోపెడు..!

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు సభలు సమావేశాల నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బుల పంపిణీపాటు గిఫ్ట్‌లు, చికెన్‌, మటన్‌, మందు వంటి వాటిలో ప్రలోభ పెట్టారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు అభ్యర్థులు ధైర్యంగా ఖర్చు చేయగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ఇంకొందరైతే ఆ ఖర్చులను తట్టుకోలేక, ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

నామినేషన్ల రోజు నాటి నుంచే..
నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది మందిని పిలిపించుకున్నారు. ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.300 చెల్లించారు. గ్రామాల్లో రోజూ ఆయా పార్టీల అభ్యర్థులు కొంత మందిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని స్టిక్కర్లు అంటిస్తూ.. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు.

బూత్‌ల వారీగా డబ్బుల పంపిణీ..
ప్రచార ఖర్చులకు తోడు బూత్‌లో ప్రచారం చేసే వారి ఖర్చుల నిమిత్తం రోజుకు ఒక పార్టీ బూత్‌కు రూ.5 వేల చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.10 వేలకు పైగా చెల్లించింది. వార్డు లీడర్లకు, ముఖ్యమైన వారికి సాయంత్రమైతే మందు పార్టీల ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఓ నాయకుడు వివరించారు. ఈ ఖర్చులను కొంత మంది అభ్యర్థులు తట్టుకోలేక నాలుగైదు రోజుల పాటు బూత్‌లలో డబ్బుల పంపిణీ నిలిపివేశారు.

మందు, విందులు అదనం..
నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ఆయా వృత్తి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారికి మందు, విందు ఏర్పాటు చేశారు. కొందరు రూ.500 చొప్పున అక్కడే పంపిణీ చేశారు.

పోలింగ్‌కు ముందు డబ్బుల పంపిణీ
పోలింగ్‌కు ముందు రోజు నుంచి అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున లక్ష మందికిపైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.వేయి, రూ.1500 పంపిణీ చేయగా, మరికొందరు రూ.200 నుంచి రూ.800 వరకు ఇచ్చారు. వీటితో పాటు మద్యం ఆఫ్‌, ఫుల్‌ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. కొందరు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఇంకొందరు రూ.2,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. రెండు మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే డబ్బుల్లేక చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయని పార్టీల కోసం ఓటర్లు చివరి వరకు ఎదురుచూసి, డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

02-12-2023
Dec 02, 2023, 12:07 IST
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం...
02-12-2023
Dec 02, 2023, 11:30 IST
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల...
02-12-2023
Dec 02, 2023, 11:23 IST
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమా?.. ఆ అంచనాలు కొనసాగుతుండగానే..  
02-12-2023
Dec 02, 2023, 10:45 IST
వేములవాడ: వేములవాడ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. సీట్ల కేటాయింపు, టికెట్ల పంపకం మొదలుకొని ఎన్నికల వరకు ఆయా పార్టీల్లో...
02-12-2023
Dec 02, 2023, 10:37 IST
కరీంనగర్‌: కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజక...
02-12-2023
Dec 02, 2023, 10:29 IST
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ఫిర్యాదుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.. 
02-12-2023
Dec 02, 2023, 09:35 IST
సాక్షి, యాదాద్రి: భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. ఓ పక్క పల్లెలు, పట్టణాలు అనే...
02-12-2023
Dec 02, 2023, 09:34 IST
నల్లగొండ టూటౌన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టిన విషయం బహిరంగ...
02-12-2023
Dec 02, 2023, 07:53 IST
పరకాల: పరకాల నియోజకవర్గంలో 84.61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు పరకాల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. పరకాల...
02-12-2023
Dec 02, 2023, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌...
01-12-2023
Dec 01, 2023, 21:15 IST
బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ...
01-12-2023
Dec 01, 2023, 16:25 IST
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి...
01-12-2023
Dec 01, 2023, 16:18 IST
తొమ్మిదేళ్ల కిందట.. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..అంటూ
01-12-2023
Dec 01, 2023, 11:51 IST
సిట్టింగ్‌ ఎమెల్యేను కాదని.. కేటీఆర్‌ సన్నిహితుడు, ఫారిన్‌ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌కు..
01-12-2023
Dec 01, 2023, 11:45 IST
సిరిసిల్లక్రైం: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులకు, ప్రజల నుంచి అత్యంత స్పందన అచిరకాలంలో గట్టి...
01-12-2023
Dec 01, 2023, 10:14 IST
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు.
01-12-2023
Dec 01, 2023, 10:11 IST
నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్‌ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో...
01-12-2023
Dec 01, 2023, 05:01 IST
లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్టుగా...
01-12-2023
Dec 01, 2023, 04:40 IST
గడప దాటని సిటీ  చెంతనే పోలింగ్‌ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు....
30-11-2023
Nov 30, 2023, 20:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ‍‍ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు...



 

Read also in:
Back to Top