మరొకరితో వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా భార్య మారకపోవడంతో.. | - | Sakshi
Sakshi News home page

మరొకరితో వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా భార్య మారకపోవడంతో..

Aug 24 2023 2:24 AM | Updated on Aug 24 2023 10:36 AM

- - Sakshi

నల్గొండ: భార్య మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం రఘనాథపాలెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం గ్రామానికి చెందిన ముత్యాలంపాటి సిద్దయ్య(36)కు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన హసీనాతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. సిద్దయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

కొంతకాలంగా హసీనా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సఖ్యతగా మెలుగుతోందని సిద్దయ్య అనుమానించాడు. ఇదే విషయంపై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా, హసినా తీరులో మార్పు రావడం లేదని కొద్ది రోజుల క్రితం ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో హసీనా ఇద్దరు కుమారులను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. సిద్దయ్య ఇద్దరు కుమారులు పక్కనే ఉంటున్న చిన్నాన్న ఇంట్లో ఉంటున్నారు.

ఎన్ని సార్లు నచ్చచెప్పినా భార్య తీరులో మార్పు రాలేదని మనస్తాపంతో సిద్దయ్య తెల్ల వారుజామున ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత సిద్దయ్య సోదరుడి కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement