ప్రజలతో మమేకం కావాలి
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నకిరేకల్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికై న వారు రాజకీయాలకతీతంగా ప్రజలతో మమేకమై గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌లో శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గతంతో పోలిస్తే గ్రామ రాజకీయాలు పూర్తి మారిపోయాయన్నారు. సామాన్య కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజలతో మమేకమైతే ఎప్పుడూ ఆశ్వీరదిస్తారని, తన రాజకీయ జీవితమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో సర్పంచ్ పదవి కీలకమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులుగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, పూజర్ల శంభయ్య, మార్కెట్, మున్సిపల్ చైర్‌పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితా, చామల శ్రీనివాస్, గాజుల సుకన్య, నకిరెకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, పన్నాల రాఘవరెడ్డి, యాసా కరుణాకర్‌రెడ్డి, గాదగోని కొండయ్య, నరేందర్ పాల్గొన్నారు.
కృష్ణపట్టెలో మొసళ్ల భయం
కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
- 8లో
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


