న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి
నల్లగొండ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటారని తెలిపారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని పేర్కొన్నారు.
పోలీసుల నిబంధనలు ఇలా..
ఫ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దు.
ఫ ఫామ్ హౌస్, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దు.
ఫ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దు.
ఫ మైనర్లకు బైకులు ఇవ్వొద్దు. వాహననడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తాం.
ఫ త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తాం.
ఫ గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


