ఎయిడ్స్‌ నివారణపైఅవగాహన | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నివారణపైఅవగాహన

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

కందనూలు: హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ నివారణపై పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వాహనాల డ్రైవర్లు, వలస కుటుంబాలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాయలంలో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వచ్చిన వారికి క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని, తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. హైరిస్క్‌ గ్రూపులైన ఆటో, లారీ, ట్రక్‌ డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని, అవసరమైన వారికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రఫిక్‌, దిశా కార్యక్రమ మేనేజర్‌ రమేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement