మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) న్యాక్ గ్రేడింగ్ మెరుగుపరిచేందుకు అధ్యాపకులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని వీసీ శ్రీనివాస్ సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించిన న్యాక్ ఏక్యూఏఆర్, ఐక్యూఏసీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో నాణ్యత పెంచేందుకు అన్ని విభాగాల వారు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు మాట్లాడుతూ న్యాక్ గ్రేడింగ్‌కు సంబంధించి నిర్ణీత గడువులోగా అవసరమైన ఆధారాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు.


