పాలమూరుకు అన్యాయం చేసే డిండి లింక్‌పై ఇప్పటికే ధర్నాలు, పాదయాత్ర, లక్ష సంతకాల సేకరణ వంటి వివిధ పద్ధతుల్లో పోరాడుతున్నాం. 400 మంది రైతులు బండ్లు కట్టుకుని మాడ్గుల తహసీల్‌కు వెళ్లి 4 గంటల పాటు ధర్నా చేశారు. ఎర్రవల్లి రైతులు దీక్షలు చేస్తూనే ఉన్నారు. దీంతో పునరాలోచన చేసిన సీఎం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామంటూ మళ్లీ ఏదుల–డిండికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. మా స్టాండ్ మారలేదు.. పోరాటంలోనే ఉన్నాం. భూమి పోరాటం పరిష్కారం కాకుండా ఎవరు ఏం చెప్పినా ఈ స్కీం పూర్తికాదు.
– రాఘవాచారి, జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక


