స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీఅన్నమయ్యవాణి లలితా సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన శ్రీవనమాలి పాదపద కవితా తాత సంకీర్తనా షష్టమ వారోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిలకపాటి విజయరాఘవాచార్యులు, సామవేదం వెంకటమురళీకృష్ణ, మనోహర్‌రెడ్డి, మల్లారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, తిరుమలనాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంకీర్తనా వారోత్సవాలు నిర్వహిస్తున్న గద్వాల చంద్రశేఖరరావును అభినందించారు.


