చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన తప్పనిసరి

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

అచ్చంపేట: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్‌ సివిల్‌జడ్జి స్పందన అన్నారు. సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌–2026లో భాగంగా గురువారం అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలు, సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలబాలికలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బాలికలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం మేరకు కఠిన చర్యలు ఉంటాయన్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదలిపెట్టేది లేదన్నారు. బాలికలను ప్రేమ పేరిట ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. బాలికలు భయం లేకుండా సురక్షిత వాతావరణంలో జీవించడంతో పాటు ఉన్నత విద్య అభ్యసించి, హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం, విద్యార్థినుల బాగోగులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సరళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement