అమ్రాబాద్: గ్రామాల్లోని కూలీలందరికీ వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా పనులు కల్పించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు అన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల అభివృద్ధి కార్యక్రమంపై గురువారం అమ్రాబాద్ మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో పనులు లేక కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. ముందస్తు ప్రణాళికలతో కూలీలకు సరిపడా పనులు కల్పించాలని సూచించారు. అదే విధంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల అభివృద్ది కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వారు ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓలు రామన్న, సుధాకరాచారి, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
రేపు గ్రంథాల ఆవిష్కరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: నగరంలోని న్యూటౌన్ శ్రీసీతారామాంజనేయ గ్రంథాలయంలో శనివారం తెలుగు సాహితీ వికాస వేదిక, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు సంయుక్త ఆధ్వర్యంలో విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు గన్నోజు శ్రీనివాసాచారి రచించిన శ్రీనివాస శతకం, గన్నోజు సప్తపది గ్రంథాల ఆవిష్కరణ, డాక్టర్ కపిలవాయి లింగమూర్తి సాహిత్య వ్యాసాలు మొదటి భాగం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థల ప్రతినిధులు డి.రాములు, గన్నోజు పద్మావతి, రావూరి వనజ, జి.శాంతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆచార్య మసన చెన్నప్ప, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి తదితరులు హాజరవుతారని, జిల్లాలోని సాహితీవేత్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ధాన్యం ధరలు ౖపైపెకి
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడులకు మంచి ధరలు లభిస్తున్నాయి. రోజురోజుకూ ధాన్యం ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.3,701, కనిష్టంగా రూ.2,828 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.3,139, కనిష్టంగా రూ.2,727, ఆముదాలు క్వింటాల్ రూ.7,939, రాగులు క్వింటాల్ రూ.5,329 చొప్పున పలికాయి.
వేరుశనగ క్వింటా రూ.8,070
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 254 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,070, కనిష్టంగా రూ. 5,320, సరాసరి రూ. 6,390 ధరలు లభించాయి. అలాగే 19 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,950, కనిష్టంగా రూ. 7,839, సరాసరి రూ. 7930 ధరలు పలికాయి. 19 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 3,227 ధర వచ్చింది.


