18 రోజుల్లో రూ.38.17కోట్లు | - | Sakshi
Sakshi News home page

18 రోజుల్లో రూ.38.17కోట్లు

Oct 28 2026 1:18 AM | Updated on Oct 28 2026 1:18 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఈసారి దసరా పండుగ సెలవుల కారణంగా ఆర్టీసీకి రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోల నుంచి 762 అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్‌ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు అధిక ఆదాయం వచ్చింది. దసరా పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9 నుంచి 26వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు రూ.38,17,94,000 ఆదాయం సమకూరింది. ఈ 18 రోజుల్లో 64.29 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగాయి. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ 104 శాతం ఆక్యుపెన్షి రేషియా సాధించింది. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.33,64,90,000 రరాబడి రాగా, ఈసారి రూ.4.60 కోట్లు అదనంగా వచ్చింది.

అందరి కృషితో సాధించాం..

దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో అన్ని ఏర్పాటు చేశాం. అన్ని డిపోల డ్రై వర్లు, కండక్టర్లు, సూపర్‌ వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి తో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఆర్టీసీపై ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్‌కుమార్‌, రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌

ఆర్టీసీకి దసరా బొనాంజ

రీజియన్‌ పరిధిలో భారీగా ఆదాయం

64.29 లక్షల కి.మీ. తిరిగిన 762 ప్రత్యేక బస్సులు

గతేడాది కంటే రూ.4.60 కోట్ల అదనపు రాబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement