ఈవీఎం గోదాం తరలింపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాం తరలింపునకు చర్యలు

Oct 28 2026 1:18 AM | Updated on Oct 28 2026 1:18 AM

కందనూలు: కలెక్టరేట్‌ సమీపంలోని ఈవీఎం గోదాం జాతీయ రహదారి–167కే నిర్మాణ పనుల పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఈవీఎం గోదాంను నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవన వసతులను కలెక్టర్‌ కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈవీఎం గోదాం ఏర్పాటుకు అనువైన గదులను పరిశీలించిన కలెక్టర్‌ గోదాం తరలింపునకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన ఈవీఎం గోదాం నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) భద్రత, రక్షణ, నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈవీఎం గోదాం తరలించే ముందు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం తరలింపు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చెన్నయ్య, ఆర్డీఓ అర్చన, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement