క్రీడలతో శారీరక, మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక, మానసికోల్లాసం

Oct 28 2026 1:18 AM | Updated on Oct 28 2026 1:18 AM

కందనూలు: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాస్థాయి బాలికల విభాగంలో ఖోఖోలో ఎంజేపీ కల్వకుర్తి జట్టు ప్రథమ స్థానం, తూడుకుర్తి ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. బాలురు విభాగంలో ఖోఖోలో ఎంజేపీ కల్వకుర్తి ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్‌ అంబటిపల్లి ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే కబడ్డీలో బాలుర విభాగంలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌ కోడేరు ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్‌ బల్మూరు ద్వితీయ స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు నిరంజన్‌యాదవ్‌, కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి యాదయ్య, అసిస్టెంట్‌ సెక్రెటరీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement