కొల్లాపూర్ మండలం నార్లాపూర్ సమీపంలోని కేఎల్ఐ డీ–5 కాల్వకు గండి పడి
సాగు నీరు వృథాగా పారుతోంది. నాలుగు రోజులుగా కాల్వ నీరు వృథాగా పోతున్న విషయం అధికారులకు చెప్పినా గండికి మరమ్మతు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవలేదని, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆరుతడి పంటలే సాగు చేయాలని చెప్పే అధికారులకు కాల్వ నీరు వృథాగా పారుతున్నా పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే కాల్వ గండికి మరమ్మతు చేపట్టి సాగునీటి వృథాను అరికట్టాలని సూచిస్తున్నారు.
– కొల్లాపూర్ రూరల్


