మన్ననూర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామాల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ ఎండీ ఖలీల్‌పాషా గురువారం ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో పరిశీంచారు. సర్వేలో భాగంగా మాచారం గ్రామంలో సర్వేయర్ నిర్మల సమక్షంలో నిర్వహిస్తున్న రీ సర్వే బృందం సభ్యులతో ఆయన సమావేశమై సర్వే పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో కచ్చితత్వంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో అమ్రాబాద్ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ పుష్ప, నాయకులు రేణయ్య, జగన్, బాలస్వామి, పద్మ, రామాంజనేయులు, రాజలింగం, జైపాల్, బాలకిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


