మహబూబ్‌నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


