మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్‌లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్ కోరారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ముగించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్ దీప్లానాయక్, చందర్‌నాయక్, ముడావత్ మణికంఠ, కుమార్, పవన్, మోహన్, ఈశ్వర్, చందర్ పాల్గొన్నారు.


