పోలీసు ఉద్యోగాలే లక్ష్యంగా అభ్యర్థుల కసరత్తు
–8లో u
కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేయడంతో అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఆయా కొలువులు సాధించాలంటే చదువుతోపాటు దేహదారుఢ్యం కీలకంగా మారనుంది. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకపక్క మైదానంలో పరుగులు మొదలుపెడుతూ.. మరోపక్క పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే తపనతో నిరుద్యోగులు తమ మెదడుకు పదును పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 116 పోలీసు కానిస్టేబుళ్లు, జోన్ పరిధిలో 11 ఎస్‌ఐలకు నోటిఫికేషన్ విడుదవగా.. ఇందుకు సంబంధించి ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సైతం ప్రారంభమైంది.
22 పోలీస్ స్టేషన్లలో..
జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం 116 కానిస్టేబుల్ పోస్టులు, జోగుళాంబ జోన్–7 పరిధిలో 9 ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. గత నియామకాల మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, శారీరక ప్రమాణాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే కొలువుదీరడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు ప్రక్రియ, పరీక్షల షెడ్డ్యూల్, శారీరక పరీక్షల తేదీల కోసం జిల్లాలోని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలోని గ్రంథాలయాలకు ఉద్యోగార్థుల తాకిడి మొదలైంది. జిల్లాకేంద్రంతోపాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో అభ్యర్థులు పోలీసు కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రతిరోజు గ్రంథాలయాలకు చేరుకొని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నాగర్‌కర్నూల్‌లోని జిల్లా గ్రంథాలయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అభ్యర్థులతో సందడిగా ఉంటుంది. నిర్వాహకులు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో ప్రతిరోజు వంద మంది వరకు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి వస్తున్నారు. అయితే గ్రంథాలయంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. ఒక పార్ట్ టైం ఉద్యోగి, ఒక స్వీపర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
జోన్ పరిధిలో
పోస్టుల వివరాలు ఇలా..
గ్రంథాలయాలకు పెరిగిన
నిరుద్యోగుల తాకిడి
ఉదయం, సాయంత్రం వేళల్లో
పుస్తకాలతో కుస్తీ
జిల్లాలో 116 కానిస్టేబుల్, జోన్ పరిధిలో 11 ఎస్‌ఐ పోస్టులు
ఈ నెల 19 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ


