ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్‌ కార్డు | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్‌ కార్డు

Aug 24 2026 12:49 AM | Updated on Aug 24 2026 12:49 AM

ఉప్పునుంతల/ అచ్చంపేట రూరల్‌/ చారకొండ: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఉప్పునుంతల, అచ్చంపేట, చారకొండలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉండి ఒక్కరికి కూడా రేషన్‌ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందరమ్మ ఇళ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. తహసీల్దార్లు సునీత, సైదులు, ఉమ, డీటీ రమేష్‌నాయక్‌, సర్పంచ్‌ శ్రీనివాసులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, మండలాధ్యక్షులు లక్ష్మీనారాయణ, భీముడునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement