ప్రణాళికతో సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో సన్నద్ధం కావాలి

Aug 24 2026 12:49 AM | Updated on Aug 24 2026 12:49 AM

ప్రణాళికతో సన్నద్ధం కావాలి ప్రిపేర్‌ అవుతున్నా.. సమయం పెంచాలి అందుబాటులో ఉంచాలి..

పోలీసు ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజానికి సేవ చేసేందుకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతోపాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీగా వ్యాయామం, రన్నింగ్‌, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్‌ టెస్టులు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవడంతోపాటు రివిజన్‌ చేయడం ముఖ్యం. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు.

– రాజశేఖర్‌, ఎస్‌ఐ, కల్వకుర్తి

ప్రభుత్వం పోలీస్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం సంతోషకరం. గత కొన్ని నెలల నుంచి ఉద్యోగం కోసం ప్రిపేర్‌ అవుతున్నా. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రతిరోజు రన్నింగ్‌ చేయడంతోపాటు ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నా.

– తిరుపతి, అభ్యర్థి,

నాగనూలు, నాగర్‌కర్నూల్‌ మండలం

పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో గ్రంథాలయ సమయం వేళలు మార్చాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయం మార్చి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తే చదువుకోవ డానికి మరింత వెసులుబాటు కలుగుతుంది.

– శివ, అభ్యర్థి, పెద్దపల్లి, తెలకపల్లి మండలం

కొన్నిరోజుల నుంచి పోలీసు ఉద్యోగం కోసం జిల్లా గ్రంథాలయంలోనే చదువుతున్నా. ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. ఎలాగైనా ఈసారి పోలీసు ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నా. లైబ్రరీలో చదవడానికి కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు. అధికారులు చొరవ తీసుకొని మాకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.

– బాలు, అభ్యర్థి, అవురాసిపల్లి,

నాగర్‌కర్నూల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement