శ్రావణమాసాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని సత్యసాయి మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించినట్లు ఆలయ అర్చకుడు రాజశేఖర్‌శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కన్వీనర్ బాలరాజు, మహిళా కన్వీనర్ సువర్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలోనూప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు చేశారు. – కందనూలు


