డ్రెయినేజీ వ్యవస్థ.. అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

డ్రెయినేజీ వ్యవస్థ.. అస్తవ్యస్తం

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అచ్చంపేట రూరల్‌: కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యానాయక్‌ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్యానాయక్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా జైల్‌భరో నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. నూతనంగా తెచ్చిన కార్మిక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, వీబీజీ రాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గుర్తించుకోవాలని హితవు పలికారు. అనంతరం స్థానిక పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్‌, మల్లేష్‌, సైదులు, రాములు, శ్రావణ్‌కుమార్‌, నాగరాజు, వెంకటయ్య, పర్వతాలు, పద్మ, లక్ష్మి, జ్యోతి, రాధ, అలివేల తదితరులు పాల్గొన్నారు.

16 అడుగులకు

చేరిన నీటి మట్టం

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు చేరుకుంది. జూరాల వద్ద ఉన్న ఉంద్యాల పంప్‌హౌస్‌ ఫేజ్‌–1 నుంచి రెండు పంపులను నడుపుతూ నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తీలేర్‌ పంప్‌హౌస్‌ ఫేజ్‌–2 నుంచి రెండు పంపులను రన్‌ చేసి కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో ప్రాజెక్టు నీటిమట్టం కేవలం 9 అడుగులు ఉండగా.. ప్రస్తుతం మరో 7 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 16.6 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. నీటి ప్రవాహం కొనసాగితే త్వరలో కోయిల్‌సాగర్‌ నుంచి ఆయకట్టు కింద పంటలకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది.

వివరాలు 9లో..

మురుగు కాల్వల్లో మొలిచిన మొక్కలు

అసంపూర్తిగా నిర్మాణాలు

వర్షాల నేపథ్యంలో దోమల విజృంభణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement