ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుదాం

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్‌నర్సింహ అన్నారు. ఈ నెల 6 నుంచి 14 వరకు చేపడుతున్న సీపీఐ ప్రజాపోరు పాదయాత్రలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నముద్దునూరు, రాంరెడ్డిపల్లి, తాళ్లపల్లి, నడిగడ్డ, రామగిరి, గౌరారం, పర్వతాపూర్‌, రాకొండ, తెలకపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పూర్తిగా విఫలం చెందారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. గతంలో కార్మికులు 8 గంటలు పనిచేస్తే నేడు 12 గంటలకు పెంచి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నష్టపరిచే విధంగా 3 చట్టాలను తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. దళిత, గిరిజన వర్గాలకు పెద్దపీట వేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపైన వివక్ష చూపడం బీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్రమోదీకి తగదన్నారు. ఈ విషయాలపై ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేశవులుగౌడ్‌, బాలమురళికృష్ణ, శివశంకర్‌, రవీందర్‌, ఆంజనేయులు, బుగ్గస్వామి, విష్ణు, నరేందర్‌రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement