ఈసారి ఖరీఫ్ సీజన్ ముగిసినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు. రైతులు ఇప్పుడు కేవలం మినుములు సాగు చేస్తే తక్కువ వ్యయంతో, తక్కువ నీటితో అధిక లాభం పొందవచ్చు. ఒకసారి తడిపితే చాలు, ఎరువులు సైతం అవసరం లేదు. అర సంచి యూరియా ఎకరానికి సరిపోతుంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్ మద్దతు ధర రూ.8,200 ఉంది. ఇక ఈ నెల మూడో వారం నుంచి వేరుశనగ సాగు చేసుకోవచ్చు. ఈ పంట సాగు పూర్తయిన తర్వాత మొక్కజొన్న సైతం యాసంగిలో సాగు చేసే అవకాశం ఉంటుంది.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
నీరు వస్తేనే పంట..
నేను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. చెరువులో నీరు లేదు. కేఎల్‌ఐ నీరు చెరువులోకి వస్తుందనే ఆశతో ఉన్నాం. సాగునీరు రాకపోయినా.. చెరువు నిండకపోయినా పంట పండదు. ఈ చెరువు కింద వానాకాలంలో 100 ఎకరాలు సాగుచేసేవారం. ఇప్పుడు 20 ఎకరాల్లోనే సాగైంది.
– బాల్‌రెడ్డి, రైతు, తోటపల్లి
జూలై నాటికి సాధారణ వర్షపాతం
204.6 మి.మీ.,
కురిసిన
వర్షపాతం
183.2 మి.మీ.,
గతేడాది ఈ సమయానికి కురిసిన వర్షపాతం 264.4 మి.మీ.,
లోటు
వర్షపాతం
12 శాతం


