వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల: సంక్షేమ పథకాల అమలులో మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. పుర్గర్‌చర్లలో కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలు లంచం తీసుకున్నారని లబ్ధిదారు తెలుపగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయ భవనం, కన్వెన్షన్‌ హాల్‌ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. భీమా కాల్వ నుంచి శ్రీరంగాపురం రిజర్వాయర్‌కు సరిపడా సాగునీరు అందేవిధంగా కాల్వల విస్తరణకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్‌ అధికారులు రైతులకు అందజేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు పరికరాల వివరాలను అందజేస్తే రైతులందరికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేలా చూస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేఎల్‌ఐ, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శివకుమార్‌, సర్పంచ్‌లు మీసాల పార్వతమ్మ, రామన్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, రాత్లావత్‌ గోపాల్‌, బండారు రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement