వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం నిత్యం తెలకపల్లి నుంచి కల్వకుర్తికి వెళ్లి వస్తుంటాం. వానాకాలంలో దుందుభీ వాగు పారితే చుట్టూ 20 కి.మీ. ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో సమయంతోపాటు అదనపు భారం పడుతుంది. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే ఎంతో మందికి మేలు కలుగుతుంది.
– సురేశ్, తెలకపల్లి
రఘుపతిపేట – రామగిరి గ్రామాల మధ్య దుందుభీ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి, ప్రజల ఇబ్బందులను తొలగించాలి.
– గణేశ్, సర్పంచ్, రఘుపతిపేట
రఘుపతిపేట బ్రిడ్జి పనులు రెండు నెలల్లో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. డైవర్షన్ రోడ్డు ఏర్పాటుకు భూ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు నివేదిక పంపాం. వర్షాకాలం ముగిసిన వెంటనే పనులను వేగవంతంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేస్తాం.
– శ్రీధర్, ఈఈ, ఆర్‌అండ్‌బీ
●


