నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్‌లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్‌ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్‌ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.


