అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
– లింగేష్, సార్లపల్లి
లోతట్టు ప్రాంత చెంచులు పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే జీవితాలు వెళ్లదీస్తున్నారు. మన్ననూర్ ఐటీడీఏ ఉన్నా చెంచులకు ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీడీఏలను నిర్లక్ష్యం చేస్తూ బడ్టేట్ కేటాయింపులు లేవు. చెంచులు వివిధ రోగాల బారిన పడి చెంచు జాతి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. – నిమ్మల శ్రీనివాసులు,
అదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
చెంచు, గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కుటుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం.
– యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ
●


