రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

పెద్దకొత్తపల్లి: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం పెద్దకొత్తపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని దేదినేనిపల్లి, చిన్నకార్పాములు, చిన్నకొత్తపల్లి, జగన్నాథపురం, పాత యాపట్ల, కొత్త యాపట్ల, చంద్రబండతండా, మారేడుమాన్‌దిన్నె గ్రామాల్లో సీపీఐ పాదయాత్ర సాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఫయాజ్‌ మాట్లాడారు. మతోన్మాద పాలకుల నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ జెన్‌–జీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయన్నారు. భవిష్యత్‌లో నియంత పాలనకు చరమగీతం తప్పదన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పాలకులు గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, శివుడు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, సాయిలు, సలేశ్వరం, రాముడు, ప్రకాష్‌, బాలపీరు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement