వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్‌మోహన్‌రావు, వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలు సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో జరిగే 72వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని వివరించారు.


