ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

కొల్లాపూర్‌: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి ఈ నెల 14 వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించన్నునట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ తెలిపారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర ధరలను తగ్గించాలని, విద్య, వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఉంచాలని, పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని, మహిళా రిజర్వేషన్లను అమలుచేయాలని, నాలుగు లేబర్‌కోడ్‌లను ఎత్తివేయాలని, బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఎన్నికలు జరపాలని, దళిత ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొల్లాపూర్‌ మీదుగా రైల్వేలైన్‌ పనులు త్వరగా చేపట్టాలని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు తుమ్మల శివుడు, జంగం శివుడు, నిరంజన్‌నాయుడు, రమణ, చంద్రయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement