అభివృద్ధి కోసం గ్రామాన్ని తరలించే ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్‌ను కోరుతున్నాం. ఇలా చేసే ముందు గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మా గ్రామంలో అటవీ శాఖ వారి ఆంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రామాన్ని తరలించే పద్ధతిలో విడిచి వెళ్లే వాళ్లకు పారదర్శకంగా అర్హులను మాత్రమే పంపించాలి. కొందరు వేరే ప్రాంతాల్లో నివాసం ఉండి వారికి గ్రామంతో సంబంధం లేకపోయినా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి అధికారులు పారదర్శకంగా చేపట్టాలి.
– వటువర్లపల్లి గ్రామస్తులు,
అమ్రబాద్ మండలం


