నాగర్‌కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో నాలుగు ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. అందులో ఒకటి మరమ్మతుకు గురైంది. దీంతో మూడు యంత్రాలతోనే పలు కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
– నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
ఇటీవల పట్టణంలో దోమల బెడద విపరీతంగా పెరిగింది. దోమలను నివారించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టం లేదు. చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి.. పారిశుద్ధ్యం లోపించి అపరిశుభ్రంగా మారాయి. దోమలు, ఇతర కీటకాలు వ్యాపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలి.
– పరమేష్,
సాయినగర్‌కాలనీ, నాగర్‌కర్నూల్


