మెరుగైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు

Jul 30 2026 5:06 AM | Updated on Jul 30 2026 5:06 AM

కల్వకుర్తి టౌన్‌: ఉపాధ్యాయులు మెరుగైన విద్య అందించినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డీఈఓ రమేశ్‌కుమార్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో సంపూర్ణ ప్రావీణ్యం కల్పించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ఇన్‌సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్‌ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మంచి అభ్యసన అలవాట్లు పెంపొందితే.. వారి భవిష్యత్‌ విద్యాభ్యాసం మరింత సులభంగా సాగుతుందన్నారు. పుస్తక పఠనం ద్వారా భాషా నైపుణ్యాలు, పద సంపద, భావవ్యక్తీకరణ, అర్థగ్రహణ సామర్థ్యం పెరుగుతాయన్నారు. విద్యార్థులకు కేవలం ఉపన్యాస పద్ధతిలో కాకుండా, కార్యకలాపాల ఆధారిత బోధన, కథలు, పాటలు, ఆటలు, చిత్రాలు, బొమ్మలు, బోధనా–అభ్యాస సామగ్రి ద్వారా బోధనను ఆసక్తికరంగా మార్చాల ని ఉపాధ్యాయులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement