విద్య, వైద్య రంగాల్లో మెరుగు | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య రంగాల్లో మెరుగు

Jan 3 2026 6:52 AM | Updated on Jan 3 2026 6:52 AM

విద్య, వైద్య రంగాల్లో మెరుగు

విద్య, వైద్య రంగాల్లో మెరుగు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కొత్త ఏడాది జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషిచేస్తానని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రాధాన్యతను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతామని.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపర్చడంతో పాటు వసతుల కల్పన, వైద్యుల సమయపాలన పాటించేలా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు 157 రెసిడెన్షియల్‌ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు, భోజన సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించామని కలెక్టర్‌ చెప్పారు. అన్ని స్కూళ్లలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషిచేశామన్నారు. తరచుగా పాఠశాలల తనిఖీలతో పాటు కాంప్లెక్స్‌ స్కూళ్ల హెచ్‌ఎంలతో పర్యవేక్షణ పెంచామన్నారు. గతంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 23వ స్థానం దక్కగా.. గతేడాది 13వ స్థానానికి మెరుగయ్యామని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం, వసతులు, పారిశుద్ధ్యం విషయంలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పారు.

జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు..

జిల్లాలో రైతులకు ఆదాయం పెంచేందుకు లాభదాయక పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఆయిల్‌పాం సాగుతో పాటు పండ్ల తోటలు పెంచేందుకు కృషిచేస్తామని అన్నారు. జిల్లాలో అధికంగా ఉన్న వేరుశనగ, మామిడి పంటల ఉత్పత్తుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే ఐసీఏఆర్‌ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. ఇందిరా సౌరగిరి పథకం ద్వారా పోడు భూములను సాగుచేస్తున్న చెంచులను అవకాడో, దానిమ్మ, నిమ్మ తదితర వాణిజ్య పంటల సాగులో ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో చెంచులకు ప్రత్యేకంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను ని ర్మించి ఇవ్వనున్నట్లు వివరించారు. సొంతంగా ఇళ్లు క ట్టుకోలేని వారికి ప్రభుత్వం తరఫున కమిటీ ఏర్పాటు చేసి నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కొత్త ఏడాదిలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యాచరణ

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మరింత పెంచుతాం

వ్యవసాయంలో రైతుల ఆదాయంపెంచేలా ప్రోత్సాహం

మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం

రోజూవారీగా భూ భారతి

పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement