మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
బిజినేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ వెంట ఎంఈఓ రఘునందన్‌రావు, హెచ్‌ఎం ప్రభాకర్ ఉన్నారు.
అభ్యంతరాలు తెలపండి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఖాళీగా ఉన్న 12 ఎంఎల్‌హెచ్‌పీఎస్ పోస్టులకు సంబంధించి ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల జాబితాను www.nagarkurnool.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని.. ఈ నెల 5వ తేదీలోగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.
5 నుంచి
సదరం క్యాంపులు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ చిన్న ఓబులేషు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 13, 20, 23, 27, 30 తేదీల్లో శారీరక దివ్యాంగులకు, 7, 21 తేదీల్లో వినికిడి లోపం ఉన్నవారికి, 5, 19 తేదీల్లో కంటిచూపు లోపం ఉన్నవారికి, 7, 21 తేదీల్లో మానసిక దివ్యాంగులకు సదరం క్యాంపులు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి వికలత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సదరం క్యాంపులకు వచ్చే వారు స్లాట్ బుకింగ్ చేసుకొని నిర్ణీత తేదీ ప్రకారం మెడికల్ రిపోర్టులతో రావాలని ఆయన సూచించారు.
అందుబాటులో 3,654 టన్నుల యూరియా
కందనూలు: జిల్లాలో ఎరువుల డీలర్లు యూరియా పంపిణీలో నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పట్టాదారు పాస్‌పుస్తకంలో భూమి విస్తీర్ణం, సాగుచేసిన పంట ఆధారంగా ఏఈఓ ధ్రువీకరణతో రైతులకు అవసరమైన మేర యూరియా అమ్మకాలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. జిల్లాలో పంట సాగుచేస్తున్న ప్రతి రైతుకు సరిపడా యూరియా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు 14,363 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ప్రస్తుతం 3,654 టన్నుల యూరి యా అందుబాటులో ఉందన్నారు. రైతులు ప్రస్తుత అవసరాల మేరకే యూరియా కొనుగోలు చేయాలని.. వచ్చే మూడు నెలల్లో మరో 38 వేల టన్నుల యూరియా రానుందని తెలిపారు.


